ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. రఘురామ కృష్ణంరాజు వ్యవహారం ఢిల్లీకి మారింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆయనను ఆంధ్రప్రదేశ్ నుంచి సికిందరాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి కూడా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న సాయంత్రం రఘురామ కృష్ణంరాజు కుటుంబ సభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమను వేధిస్తోందని రఘురామకృష్ణంరాజుని సిఐడి విచారణలో భాగంగా తీవ్రంగా కొట్టారు అంటూ రఘురామ కృష్ణంరాజు కుటుంబ సభ్యులు హోం మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఇక ఇప్పుడు కాసేపట్లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో రఘురామ కుటుంబ సభ్యులు భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలను అదేవిధంగా రఘురామకృష్ణంరాజుపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను ఆయనకు వివరించనున్నారు.