జగన్ మోహన్ రెడ్డి రాముడు కాదు… రావణాసురుడు – రఘురామ

-

తనకు తానే హీరోనని, ఇంకెవరో విలన్ అని జగన్ మోహన్ రెడ్డి గారు పేర్కొన్నప్పటికీ, ఇందులో ఇద్దరు హీరోలు… RRR తరహాలో ఇది మల్టీస్టారర్ సినిమా అని, కానీ విలన్ మాత్రం నువ్వే అని రఘురామకృష్ణ రాజు గారు వ్యాఖ్యానించారు. నందమూరి, కొణిదెల కుటుంబాల నుంచి హీరోలు ఉంటే, ఈ చిత్రంలో బ్రిటిష్ వాడి మాదిరిగా బహుశా విలన్ మీరే అవుతారని, సినిమాలో మీకు మీరే హీరోనని చెప్పుకున్నారని, రామాయణం, భారతం అనే గ్రంథాల గురించి ముఖ్యమంత్రి గారికి అవగాహన ఉన్నందుకు అభినందనలని అన్నారు.

సినిమాలో హీరోని అభిమానించినట్లుగా ప్రజలు తనని అభిమానిస్తారని జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పారని, కానీ విలన్ ను ఎవ్వరూ అభిమానించరని అన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రామోజీరావు గార్ల పేర్లను ప్రస్తావిస్తూ వారిని విలన్లతో పోల్చారని, రామాయణం, భారతం, బైబిల్, ఖురాన్ లలో హీరోని ప్రజలు అభిమానించారని, రామాయణంలో మిమ్మల్ని మీరు రాముడు అనుకున్నారు… కానీ మీరు రాముడు కాదు రావణసురుడివి అని అందరికీ తెలుసునని అన్నారు.

రావనాసురుడుశివుడి కోసం తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని అనుగ్రహం పొందారని, ప్రజా దేవుళ్ల వద్ద రావణాసురుడి మాదిరిగానే మీరు కూడా 151 స్థానాలను పొందారని, శివుడిచ్చిన వరాన్ని ఆయన పైనే ప్రయోగించాలనుకున్న బస్మాసురుడిలాగా తయారై, ప్రజలపై రకరకాల పన్నుపోట్లు వేసి బటన్ నొక్కానని చెబుతున్నారని అన్నారు. ఎన్నో ప్రజాయుతమైన సంక్షేమ పథకాలను ఎత్తివేసిన విషయాన్ని విస్మరిస్తున్నారని, కోటానుకోట్ల రూపాయల అప్పులు చేశారని, భారతంలో కృష్ణుడు, అర్జునుడు కూడా మీరు కాదని అందులో దుర్యోధనుడు మీరైతే, శకుని ఎవరో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. బైబిల్లో జీసస్ కాదు మీరు, సైతాన్ అని, ఖురాన్ లో మమ్మద్ ప్రవక్త కాదు ఖురాన్ వర్షన్ సైతాన్ ఎబ్లీస్ మీరు అంటూ రఘురామకృష్ణ రాజు గారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news