మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన ఎంపీ రఘురామకృష్ణ

-

దొంగ ఓట్ల నిర్మూలనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసిన శుభవార్తను విన్నామని వ్యాఖ్యానించారు వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మన ఓట్లను మనం రక్షించుకుంటూ దొంగ ఓట్లను నిర్మూలిస్తే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఔట్ అవుతుందని అన్నారు. దొంగ ఓట్లపై ఆధారపడే తమ పార్టీ నాయకులు విజయంపై నమ్మకంతో ఉన్నారన్నారు రఘురామకృష్ణరాజు. మున్ముందు ఇలాంటి మరిన్ని శుభవార్తలు వింటామన్నారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఫేస్‌బుక్‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.

Rebel MP Raghu Ramakrishna Raju fires salvo at YSR Congress; questions party's existence

మార్గదర్శి సంస్థపై గత ఐదు రోజులుగా జగన్ దిశా నిర్దేశంతో కొనసాగుతున్న వేధింపు దాడులపై కోర్టు మధ్యంతర స్టే విధిస్తూ, రెండు రోజుల పాటు బ్రేక్ వేస్తూ మధ్యంతర స్టే ఇచ్చిన న్యాయస్థానం, రెండు రోజుల అనంతరం శాశ్వత స్టే ఇచ్చే అవకాశాలు లేకపోలేదన్నారు. గతంలోనూ న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వులను వక్రీకరించి, చందాదారులను ఫిర్యాదు ఇవ్వమని ఒత్తిడి చేసి, పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని, దొంగ ఫిర్యాదులు ఇవ్వమని చందాదారులపై అనేక ఒత్తిళ్లు చేసినప్పటికీ, పోలీసులు నమోదు చేసిన కేసులు న్యాయస్థానం ముందు నిలబడలేదని అన్నారు.

 

తాజాగా నమోదు చేసిన కేసులోనూ బ్రాంచ్ మేనేజర్లను అరెస్టు చేసి కస్టడీకి ఇవ్వాలని కోరారని, అయినా న్యాయస్థానం నిరాకరించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తుందని మరో మారు స్పష్టం అయ్యిందని అన్నారు. పోలీసు వ్యవస్థను ఈ పాలకులు దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారని, ఒక రాజకీయ నాయకుడు చెప్పాడని, ఐపీఎస్ పాస్ అయిన అధికారులు కూడా తింగరి చేష్టలకు పాల్పడుతున్నందుకు సిగ్గుపడాలని, వీరు ఐపీఎస్ ఎలా పాస్ అయ్యారో అర్థం కావడం లేదన్నారు. ఐపీఎస్ అధికారులు కూడా చట్టంలోని నిబంధనలు పాటించకపోవడం దుర్మార్గమన్నారు. ఇలాంటి వెధవ పనుల్లో పాలుపంచుకుంటున్నందుకు తమను చూసి తామే సదరు అధికారులు సిగ్గుపడాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news