కేసీఆర్ మోసాలపై ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది : డీకే అరుణ

-

2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఏడు చోట్ల తప్ప మిగతా నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ అభ్యర్థులకే ఛాన్స్‌ ఇచ్చినట్లు కేసీఆర్‌ ప్రకటించారు. గజ్వేల్‌, కామారెడ్డి స్థానాల్లో తాను పోటీ చేయనున్నట్లు సీఎం చెప్పారు. మంచి ముహూర్తం ఉండటంతో జాబితా ప్రకటించినట్లు తెలిపారు. కంటోన్మెంట్‌ సీటు సాయన్న కూతురు లాస్య నందితకు కేటాయించినట్లు వెల్లడించారు. అయితే.. ఈ నేపథ్యంలో బీజేపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. అభద్రత భావంతోనే రెండు చోట్ల పోటీకి కేసీఆర్ సిద్ధమయ్యారని విమర్శించారు.

People are ready to corner CM : DK Aruna | INDToday

ఇవాళ ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది కేసీఆర్‌ రోజుకో ప్రకటన చేస్తున్నారని ఆమె అన్నారు. అంతేకాకుండా.. కేసీఆర్‌ మోసాలపై ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్ర పథకాలపై గ్రామ గ్రామాన అవగాహన తేవాలని పార్టీ శ్రేణులక పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఅర్ఎస్ రెండూ బీజేపీ నీ టార్గెట్ చేస్తూ ప్లాన్ గా ముందుకి వెళ్తున్నాయని ఆమె ఆరోపించారు. కేసీఆర్ అవినీతిని ఎండగట్టాలని, నిర్మల్ మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకించిన మహేశ్వర రెడ్డి పై లాఠీ చార్జి చేసి దుర్మార్గంగా వ్యవహరించారు డీకే అరుణ. పరామర్శించేందుకు వెళ్తున్న నన్ను అరెస్ట్ చేశారని ఆమె మండిపడ్డారు. రైతుల తరఫున మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షను చేస్తుంటే అడ్డుకున్నా రని, రైతులు ఆందోళన చేస్తుంటే కేసీఆర్ కు బాధ్యత లేదా? అని ఆమె ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news