ఏపీ రాజధాని పూర్తిగా అమరావతిలోనే ఉండాలని రాజధాని రైతులు కొంతమంది ధర్నాలు, దీక్షలూ జరుగుతున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో ఆయా పార్టీలలో నేతలు.. పార్టీ అభిప్రాయాలతో ప్రమేయం లేకుండా వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగం గానే చెబుతున్నారు. ఈ క్రమంలో మైకందుకున్నారు వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు!
అమరావతిలోనే రాజధాని ఉండాలని కొందరు చెబుతుండగా.. అమరావతిలో కూడా రాజధాని ఉంటుంది, కాకపోతే కొంత విశాఖకు, మరికొంత కర్నూలు కూడా వెళ్తుంది అని మరికొందరు చెబుతున్నారు. ఈ క్రమంలో స్పంందించిన రఘురామకృష్ణంరాజు… మూడు రాజధానులు అనే విషయం తమ పార్టీ అజెండాలో లేదని.. అది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయమని చెబుతున్నారు. రీజనల్ పార్టీల్లో కూడా ఇంత భారీ లాజిక్ అప్లై అవుతుందని చాలా మందికి ఇప్పుడే తెలిసి ఉంటుంది అనే కామెంట్ల సంగతి కాసేపు పక్కనపెడితే… అమరావతికే జగన్ అసెంబ్లీలో మద్దతిచ్చారని చెబుతున్నారు!
ఇదే క్రమంలో ప్రభుత్వానికి ఒక కొత్త ఆప్షన్ ఇచ్చే ప్రయత్నం చేశారు రఘురామకృష్ణంరాజు! నిజంగా పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల నిర్ణయం తీసేసుకున్నారు కాబట్టి… విశాఖకు మారుతున్న కార్యనిర్వాహక రాజధాని గా అమరావతిని చేయాలని సూచిస్తున్నారు. దానర్ధం… మూడు రాజధానులకు తాను అనుకూలం అని పరోక్షంగా చెబుతూనే… కేవలం అసెంబ్లీ మాత్రమే అమరావతిలో ఉండకుండా… మొత్తం పాలన అంతా అమరావతి నుంచే చేయాలని ఎంపీ చెబుతున్నారన్నమాట!