ఏపీ ప్రబుత్వం ప్రతిష్టాత్మకంగా అముల చేయాలని నిర్ణయించుకున్న`నవరత్నాలు-
ఈ నేపథ్యంలో ముందు పాతిక లక్షలు అనుకున్న ఈ లబ్ధి దారుల సంఖ్య ఇప్పుడు 30 లక్షలకు చేరింది. ఇక, ఏప్రిల్‌లో వచ్చిన తెలుగువారి కీలకమైన పండుగ ఉగాదిని ఈ ఇళ్ల పంపిణీకి తొలుత ముహూర్తంగా నిర్ణయించుకున్నారు. అయితే, స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఇది వాయిదా పడింది. ఇక, ఆ తర్వాత లబ్ధి దారుల సంఖ్య పెరగడంతోపాటు. స్థలాల సేకరణ విషయంలో తలెత్తిన వివాదాల కారణంగా.. ఈ కార్యక్రమం వాయిదా పడుతూనే ఉంది. ఎట్టకేలకు జూలై 8 వైఎస్సార్ జయంతిని ముహూర్తం గా నిర్ణయించారు. ఎట్టి పరిస్థితిలోనూ ఆ రోజు పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి సమయం దగ్గరపడుతూ వచ్చింది.
ఈ క్రమంలోనే టీడీపీ నేతలు అనూహ్యంగా ఓ విషయాన్ని తెరమీదికి తెచ్చారు. అదేంటంటే.. తమకు బలం ఉన్న నియోజకవ ర్గాల్లో ఓట్లు చీల్చేందుకు.. పేదలను అక్కడ నుంచి తరలించేందుకు జగన్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా కుట్ర పన్నుతోందన్నది వారి ఆరోపణ. ఉదాహరణకు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం. ఇక్కడ బాబుకు ఓటు బ్యాంకు ఎక్కువ. అదేసమయంలో చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల్లో వైసీపీకి బలం ఎక్కువ. దీంతో అక్కడ నుంచి పేదలను కుప్పంలోకి తరలిస్తే.. అంటే.. కుప్పంలో వారికి ఇళ్లపట్టాలు ఇస్తే.. ఓట్లు అన్నీ కూడా కుప్పంలోకి వస్తాయని, దీంతో చంద్రబాబు ఓటు బ్యాంకుకు గండి కొట్టచ్చని జగన్ భావిస్తున్నట్టు తమ్ముళ్లు చెబుతున్నారు.
ఈ తరహా వ్యూహం.. అక్కడే కాకుండా టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ అమలు చేయాలని చూస్తున్నరని అంటున్నారు. దీనిని ఎలా అడ్డుకోవాలా? అని తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారట! మరి ఏం చేస్తారో చూడాలి.