దేశంలో అయిదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ మరియు మిజోరాం రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున అన్ని పార్టీలు వ్యూహాలు, అభ్యర్థులు, ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మిజోరాం పర్యటనలో కేంద్ర ప్రభుత్వంపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో బీజేపీ తీసుకువచ్చిన GST వలన చిన్న మధ్య తరగతి వ్యాపారాలు చితికిపోయారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ GST ఈ వ్యాపారులను దెబ్బ తీయడానికి తీసుకువచ్చారని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు రాహుల్ గాంధీ.
ఇంకా రైతులు కూడా వలన చాలా బలహీనం అయిపోయారని రాహుల్ కీలకమైన విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లారు. ఇటువంటి చాలా తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకున్న బీజేపీని ఇకపై జరిగే ప్రతి ఎన్నికల్లోనూ ఓడించాలని ఉత్తేజపరిచారు రాహుల్ గాంధీ.