Breaking : కాంగ్రెస్‌కు జిట్టా బాలకృష్ణ రెడ్డి రాజీనామా

-

తెలంగాణలో ఎన్నికలు వేడిపెంచుతున్నాయి. ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడ్డ నేతలు ఆయా పార్టీలను వీడుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. భువనగిరి కాంగ్రెస్ పార్టీకి షాక్‌ తగిలింది. జిట్టా బాలకృష్ణారెడ్డి బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇవాళ భువనగిరిలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో సీఎం కేసీఆర్ కండువా కప్పి జిట్టాను పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఇటీవలే బాలకృష్ణారెడ్డిని బీజేపీ పార్టీ సస్పెండ్‌ చేసింది. అనంతరం ఆయన కాంగ్రెస్‌‌లో జాయన్ అయ్యారు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారు.

Jitta Balakrishna Reddy : మాన‌సికంగా బీజేపీకి దూర‌మ‌య్యాను - TeluguISM -  Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE |  Telugu News Online | Telugu Breaking News

అయితే.. ఆయ‌నతో పాటు మ‌హ‌బూబ్ న‌గ‌ర్ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీ‌నివాస్ రెడ్డి సైతం కాషాయాన్ని వీడారు. ఇటీవ‌లే ఇద్ద‌రూ క‌లిసి రేవంత్ రెడ్డి స‌మక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఇద్ద‌రు నేత‌లు ఎమ్మెల్యే టికెట్ల‌ను ఆశించారు. ఇదే హామీపై వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఏఐసీసీ ఎన్నిక‌ల స్క్రినింగ్ క‌మిటీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. 119 సీట్ల‌కు గాను 55 సీట్ల‌కు సంబంధించి అభ్య‌ర్థుల‌తో కూడిన తొలి జాబితాను వెల్ల‌డించింది. ఈ లిస్టులో ఇత‌ర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో జంప్ అయిన 20 మంది నేత‌ల‌కు టికెట్లు ద‌క్కాయి. ఇందులో 17 మంది రెడ్ల‌కు ద‌క్క‌డం విశేషం. ఉద్య‌మ‌కారుడిగా జిట్టా బాల‌కృష్ణా రెడ్డికి మంచి పేరుంది. ఈ త‌రుణంలో త‌ను కేసీఆర్ సార‌థ్యంలోని బీఆర్ఎస్ పార్టీలో జంప్ అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్న‌ట్లు స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Latest news