నరేంద్ర మోడీ కాదు.. ‘సరండర్ మోడీ’..! మోడీ పై రాహుల్ వ్యంగ్యస్త్రాలు…!

 

గాల్వాన్ లోయలో జరిగిన మారనఖాండ అందరినీ తెలిసిన విషయమే.. కానీ ఇప్పుడు ఈ అంశంపై అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అసలు భారత్ చైనా సైనికులు మధ్య గొడవ ఎందుకు ప్రారంభమయ్యింది..? అసలు సరిహద్దులు దాటి మితిమీరింది ఎవరు..? గాల్వాన్ లోయ ఎవరి భూభాగంలో ఉంది..? గొడవ జరిగినప్పుడు భారత సినికుల దగ్గర ఆయుధాలు ఎందుకు లేవు..? ఇలాంటి ప్రశ్నలకు మాత్రం సమాధానం ఎక్కడా దొరకడం లేదు.

ప్రధాని మోడీ మన సైనికుల మరణం ఊరికేపోదు అని హామీ ఇచ్చారు.. కానీ పై ప్రస్తావించిన ఏ అంశానికి ఆయన సమాధానం ఇవ్వలేదు. ఇక ఇదే అంశాన్ని టార్గెట్ చేసుకున్న రాహుల్.. ప్రధానిని పలు సార్లు ప్రశ్నిస్తున్నాడు. బీజేపీ నుండి కానీ ప్రధాని నుండి గాని ఎటువంటి సమాధానం రాకపోయేసరికి ఆయన ఇప్పుడు ప్రధాని మోడీ పై వ్యంగ్యస్త్రాలు గుప్పిస్తున్నాడు. మన ప్రధాని నరేంద్ర మోడీ కాదని సరేందర్ మోడీ అని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశాడు. ఇక ఆయన ట్వీట్ నీ సమర్ధిస్తూ కొందరు వ్యతిరేకిస్తూ కొందరు ట్వీట్లు చేస్తున్నారు కానీ రాహుల్ అడిగిన ప్రశ్నలకు ఎవ్వరూ సరైన సమాధానాలు ఇవ్వలేకపోతున్నారు.