రాహుల్ గాంధీ ఒక రాజకీయ నాయకుడిగా ప్రజల శ్రేయస్సు కోరుకునే వ్యక్తి అని దేశానికి తెలియచేసిన సందర్భం ఏదైనా ఉంది అంటే అది కేవలం … “భారత్ జోడో యాత్ర” ప్రారంభించాలన్న ఆలోచన రావడమే అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక దీనికి ప్రత్యక్ష సాక్ష్యమే ఈ రోజు పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ ప్రసంగం .. ఈయన మాట్లాడుతూ నేను భారత్ జోడో యాత్రలో పాల్గొన్న మొదటి క్షణం నుండి కూడా చాలా మారాను అంటూ చెప్పాడు. వివిధ వర్గాల, మతాల ప్రజలను కలిసి వారితో ముచ్చటించడం వలన నాలోని అహంకారం మరియు ద్వేషం లాంటివి పటా పంచలు అయిపోయాయి అంటూ రాహుల్ గాంధీ సంతోషంగా వ్యక్తం చేశారు. ఎప్పుడైతే మనలో పాతుకుపోయిన ద్వేషం మరియు అహంకారాన్ని పారద్రోలుతామో అప్పుడే ఈ దేశ ప్రజల స్వరాన్ని వినగలం అంటూ తెలిపారు.
ఈ వ్యాఖ్యలను విన్న ఏ భారతీయుడు అయినా కాంగ్రెస్ ను మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని అనుకుంటారు అనడంలో ఎటువంటి అతియోశయోక్తి లేదు.