మరికొద్ది గంటల్లో రాహుల్ గాంధీ “భారత్ జోడో” యాత్ర

-

మరి కొద్ది గంటల్లో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభం కానుంది. రేపు ఉదయం 7 గంటలకు చెన్నై దగ్గర వున్న శ్రీ పెరంబదూర్ లో రాజీవ్ గాంధీ సమాధి వద్ద రాహుల్ గాంధీ నివాళులు అర్పిస్తారు. తర్వాత కన్యాకుమారి చేరుకుని కామరాజ్ నాడార్, మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించి.. 3 గంటలకు వివేకానంద రాక్ మెమొరియల్, కామ్ రాజ్ మెమోరియల్, తిరివళ్లూర్ మెమోరియల్ వద్ద ప్రార్థనలు చెస్తారు.

ఆ తర్వాత మహాత్మాగాంధీ మండపం వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం తమిళనాడు సీఎం స్టాలిన్, చత్తీస్‌గఢ్ భూపేష్ భగేల్,రాజస్థాన్ సీఎం గెహ్లాట్ లు రాహుల్ గాంధీ కి జాతీయ జెండా అందిస్తారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, సిడబ్ల్యూసి సభ్యులు హాజరుకానున్నారు. గాంధీ మండపం వద్ద వున్న బీచ్ రోడ్ లో 5 గంటలకు పబ్లిక్ మీటింగ్..మీటింగ్ తర్వాత భారత్ జోడో యాత్రకు రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టనున్నారు.

సెప్టెంబర్ 8 ఉదయం 7 గంటలకు వివేకానంద పాలిటెక్నిక్ కాలేజ్ నుండి భారత్ జోడో యాత్ర ప్రారంభం కానుంది. ప్రతి రోజు కనీసం 20-24 కిలోమీటర్ల మేరనడక(పాదయాత్ర) ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 7.00 -10.30 గంటల వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. విరామం తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 3.30 – 7:30 వరకు రాహుల్ పాదయాత్ర కొనసాగుతుంది.

150 రోజులు..3570 కిలోమీటర్లు 12 రాష్ట్రాలు..2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా కాశ్మీర్ చేరనుంది రాహుల్ గాంధీ పాదయాత్ర. మధ్యలో స్థానిక ప్రజలను కలుస్తూ పాద యాత్ర ఎందుకు చేస్తున్నానో వివరించనున్నారు రాహుల్ గాంధీ. “ఏక్ తేరా కదమ్..ఏక్ మేరా కదమ్..మిల్ జాయే జుడ్ జాయే..ఆప్ నా వతన్” నినాదం తో రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news