గణేష్ నిమజ్జనంలో కూతురుతో కలిసి బన్నీ హడావిడి..ఫొటోస్ వైరల్..!

-

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినాయక చవితిని అంగరంగ వైభవంగా జరుపుకున్న విషయం తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు ఈ వేడుకను చాలా ఘనంగా నిర్వహించారు. ఇకపోతే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ గీత ఆర్ట్స్ సంస్థలో నెలకొల్పిన వినాయకుడి నిమజ్జనోత్సవానికి స్టాఫ్ తో పాటు కూతురు అర్హా ను కూడా తీసుకొని ఊరేగింపుగా వెళ్లారు. కూతురుతో కలిసి స్టెప్పులేస్తూ సందడి చేయడం జరిగింది.. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హను ఎత్తుకొని డాన్స్ చేస్తూ సందడి చేయడంతో దీనిని చూడడానికి అభిమానులు కూడా భారీగా తరలివచ్చారు. ఇక ఈ సందర్భంగా దారి పొడవునా అల్లు అర్జున్ అభిమానులు సందడి చేస్తూ ఆ వాహనాన్ని అనుసరించారు.ఇక వ్యాన్లో గణపతిని ఊరేగిస్తూ ఉండగా అల్లు అర్జున్ వెనకనే కారులో ఫాలో అయ్యారు. కొంచెం దూరం వచ్చాక కారు దిగి , వినాయక చవితి రోజున ఇంట్లో పెట్టిన గణపతి బొమ్మని తీసుకొచ్చి పెద్ద గణపతి దగ్గర పెట్టించారు. ఇక అనంతరం భక్తులతో కలిసి గణపతి బప్పా మోరియా , జై బోలో గణేష్ మహరాజ్ కీ జై అంటూ నినాదాలు కూడా చేశారు. ఇక తన కూతుర్ని ఎత్తుకొని భక్తులు అభిమానుల మధ్య సందడి చేశారు ఇక కొబ్బరికాయ కొట్టి అక్కడ నుంచి వెళ్లిపోయారు అల్లు అర్జున్. సాధారణంగా ఇంట్లో సెలబ్రేషన్స్ చేసుకోవడం ప్రతి ఒక్కరికి కామన్.. కానీ ఇలా నలుగురితో కలిసి సెలబ్రిటీలు పబ్లిక్ గా సాంప్రదాయ వేడుకలు చేసుకోవడం అనేది కేవలం అల్లు అర్జున్ కి మాత్రమే చెల్లింది అంటూ అభిమానులు పొగడ్తలతో ముంచేత్తుతున్నారు.

ముఖ్యంగా కూతుర్ని కూడా బయట నిమజ్జనోత్సవం వేడుకలకు తీసుకువచ్చి పిల్లలకు కూడా అన్ని సాంప్రదాయాలను పరిచయం చేస్తూ ఉండడం అందరినీ ఆశ్చర్యంతో పాటు ఆనందానికి గురిచేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట బాగా వైరల్ గా మారుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news