ఎస్పీ బాలుకి స్వీట్ నివాళి.. కేక్ తో విగ్రహం

-

కొద్ది రోజుల క్రితం పోస్ట్ కరోనా సమాస్యలతో బాధ పడుతూ లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కన్నుమూసిన సంగతి తెలిసిందే.  దాదాపు నెలన్నర రోజులు చెన్నైలోని MGM ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే బాలసుబ్రహ్మణ్యానికి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. అలానే ఏపీలో ఏర్పాటు చేసిన ఒక సంగీత పాఠశాలకు ఎస్పీ బాలుకు అరుదైన గౌరవం ఇచ్చారు.

ఇక తాజాగా ఎస్పీ బాలుకు అరుదైన గౌరవం దక్కింది. కేక్ తో ఎస్ పి బాలు విగ్రహం ఎర్పాటు చేశారు. పుదుచ్చేరి లోని బేకరిలో కేక్ తో బాల సుబ్రమణ్యం విగ్రహం తయారయింది. ఆ బేకరీ యాజమాన్యం 339 కిలోలతో చాక్లెట్, బాదం,ఇతర ఫేవర్స్ తో 5,8 ఎనిమిది అంగుళాల హైట్ తో విగ్రహాన్ని రూపొందించింది. దాదాపు 161 గంటలు కష్టపడి తయారుచేసి కేక్ ..ప్రస్తుతం హాట్ టాఫిక్ మారింది.  బాలు విగ్రహా కేక్ తో సెల్వీ దిగుతున్నారు అభిమానులు.

Read more RELATED
Recommended to you

Latest news