ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర ఆంధ్ర ప్రదేశ్-దక్షిణ ఒడిస్సా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం & దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది.
అయితే దీనికి అనుబంధముగా దక్షిణ ఒడిస్సా & ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మధ్యస్థ ట్రోపో స్పియరిక్ స్థాయిల వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపు వంగి కొనసాగుతున్నది.
తూర్పు-పశ్చిమ షీర్ జోన్ 18°N లాటిట్యూడ్ వెంబడి సముద్ర మట్టం నుండి 2.1 km నుండి 5.8 km మధ్య విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశ వైపు వంగి కొనసాగుతున్నది. వీటి ఫలితముగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు చేసింది. ఇందులో ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాలో భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.