తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర అండమాన్ సముద్రతీరంలో అవతారం స్థిరంగా కొనసాగుతోంది అది రాగల 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్ప పీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి రాబోయే 24 గంటల్లో దక్షిణ ఒరిస్సా ఉత్తర కోస్తాఆంధ్ర తీరానికి చేరుకోవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.
దీని ప్రభావంతో రేపు ఎల్లుండి తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికే తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాలతో వగుకు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదులలోకి కూడా భారీగా వరద నీరు చేరింది. ఇక హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసినప్పుడల్లా తడిసి ముద్దవుతుంది. హైదరాబాద్ పక్కన గల మూసీ నదిలో కూడా భారీగా వర్షపు నీరు చేరుకుంది.