ఏపీలో రానున్న మూడు రోజుల పాటు సాధరణ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ రోజు, రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందట.
ఇక ఈ రోజు, రేపు దక్షిణ కోస్తాలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతే కాక ఎల్లుండి దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక రాయలసీమ విషయానికి వస్తే ఈరోజు, రేపు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.