కేంద్ర ప్రభుత్వం అన్నదాత, పంట పండిస్తున్న రైతుల వెన్నులో కత్తితో పోడుస్తోందని ఎంపీ కేశవరావు విమర్శించారు. గత మూడు నెలల నుంచి పార్లమెంట్ లో ధాన్యం కొనుగోలు అంశంపై పోరాడుతున్నామని ఆయన అన్నారు. తెలంగాణ మంత్రులతో కలిసి కేంద్రమంత్రిని కలిసినా ప్రయోజనం చేకూరలేదని ఆయన అన్నారు. కేంద్ర పెద్దలు మాటలు మంచిగానే ఉాన్నా….చేతలు మంచిగా లేవని కేశవరావు అన్నారు.
యాసంగి పంటను కేంద్రం తీసుకోమని చెబితే…యాసంగి పంటను తగ్గించామని, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో అన్ని చేసిందని ఆయన అన్నారు. ఇది రాజకీయ కాదని, ఇది ధర్మ పోరాటం అని ఆయన అన్నారు. అన్నదాత పండించిన పంటను కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం ఎంతవరకైనే న్యాయబద్ధంగా మన ధాన్యాన్ని కొనుగోలు చేయరో… అప్పటి వరకు ఈ పోరాటం కొనసాగుతోందని కేశవరావు అన్నారు. మేం ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే పోరాడుతున్నామని.. అన్నదాతకు వెన్నుదన్నుగా ఉండేలా కేంద్రాన్ని కోరుతున్నామని కేశవరావు అన్నారు.