కేంద్ర ప్రభుత్వం ధాన్యం కోనుగోళ్లపై వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా… టీఆర్‌ఎస్ సర్కార్ దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. టీఆర్‌ఎస్ సర్కార్ ధర్నా పై రాకేష్ టికాయత్ సంచలన ట్వీట్ చేశారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రానికి వ్యతిరేకంగా.. ఢిల్లీలో ధర్నా చేయడం దారుణమని.. ఇది కేంద్ర ప్రభుత్వానికే సిగ్గు చేటని నిప్పులు చెరిగారు.
” రైతుల పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం (తెలంగాణ) ధర్నాకు దిగడం సిగ్గుచేటని పరిస్థితి. కేంద్రం అన్ని రాష్ట్రాల రైతులకు ఒక్కో ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలి. లేనిపక్షంలో రైతులు రోడ్డుపైకి రావాల్సి వస్తుందన్నారు.” అంటూ హిందీ లో ట్వీట్ చేశారు టికాయత్. అంతేకాదు… టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ధర్నాకు సీఎం కేసీఆర్ తో పాటు రాకేష్ టికాయత్ వచ్చారు. స్వయంగా సీఎం కేసీఆర్ తన కాన్వాయ్ లోనే… రాకేష్ టికాయత్ ను ధర్నా స్థలానికి తీసుకుని వచ్చారు.
एक राज्य सरकार (तेलंगाना) किसानों की फसल खरीद की मांग को लेकर केंद्र के खिलाफ धरने पर बैठे यह शर्मनाक स्थिति है। केंद्र को सभी राज्यों के किसानों का एक – एक दाने की खरीद सुनिश्चित करनी चाहिए। वरना किसानों को तो मजबूरन सड़क पर आना ही पड़ेगा।@PTI_News @PMOIndia @ANI @TelanganaCMO
— Rakesh Tikait (@RakeshTikaitBKU) April 11, 2022