ముంబై: పోర్న్ వీడియోల కేసులో అరెస్టైన నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేసి బైకుల్లా జైలుకు తరలించారు. ఈ కేసులో రాజ్ కుంద్రాను కస్టడీకి తీసుకోనున్నారు. జైలులోని క్రైమ్ బ్రాంచ్ ప్రాపర్టీ సెల్‌లో రాజ్‌కుంద్రాను విచారించనున్నారు. ఈ నెల 27 వరకు అతన్ని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారించనున్నారు.
కాగా ప్రముఖ వ్యాపార వేత్త, నటి శిల్పా శెట్టి భర్తను పోర్న్ వీడియోల కేసులో జులై 19న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను జులై 23 వరకూ జుడీషియల్ కస్టడీకి తీసుకుని విచారించారు. రాజ్ కుంద్రా జుడీషియల్ కస్టడీ నిన్నటితో ముగియడంతో తాజాగా ఆయన్ను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. రాజ్ కుంద్రాను మరింత విచారించాల్సిన అవసరం ఉందని పోలీస్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు కోర్టు రాజ్ కుంద్రాను 4 రోజులు పాటు విచారించేందుకు అనుమతించింది. పోర్ట్ వీడియోల కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఈ కేసులో ఆయనే కీలక సూత్రదారులుగా ఉన్నట్లు పోలీసులు నిర్దారించారు.