ప్రేరణ: రాజ్ నందిని విజయం ఎందరికో ఆదర్శం..!

-

అన్ని ఏర్పాట్లు చేసి అన్ని సౌకర్యాలు ఇస్తున్న సరే చదువుకోవడానికి ఆసక్తి చూపని విద్యార్థులు ఉంటే… ఉన్న పరిస్థితులతో విజయాన్ని అందుకోవాలని అహర్నిశలు తపించే విద్యార్థులు కూడా ఉన్నారు అని రాజ్ నందిని రుజువు చేసింది. మనం పడే కష్టానికి ఎప్పుడూ ఓటమి ఉండదు అని నిరూపించింది ఈ చిన్నారి. నిజంగా రాజ్ నందిని గురించి చూస్తే కంటతడి పెట్టుకుంటారు.

అడుగు అడుగు కూడా ఎంతగానో శ్రమించి విజయాన్ని అందుకుంది. ఈమె వయసు కేవలం 18 సంవత్సరాలు. JEE అడ్వాన్స్ 2021 ఫలితాల్లో ఆమె విజయం సాధించింది. ఉత్తరాఖండ్లో మారుమూల గ్రామంలో జన్మించిన ఈమె చిన్ననాటి నుండి కూడా ఎన్నో కష్టాలను అనుభవించింది. పేదరికంతో చదువుకోలేనేమో అన్న ఆలోచన ఆమెకి ఎప్పుడూ రాలేదు.

ఈమె పన్నెండవ తరగతి జవహర్ నవోదయ విద్యాలయం లో పూర్తిచేసింది. ఆ తర్వాత ప్రభుత్వం నడిపించే సెంటర్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ లీడర్షిప్ CSRL సూపర్ 30 పరీక్ష ఈమె రాయాలి అని అనుకుంది. ఇందులో కనుక ఆమె విజయం సాధిస్తే కేంద్రం ఆమె చదువు ఖర్చుని భరిస్తుంది.

ఆమె ఎంట్రన్స్ పరీక్ష రాసింది ఆమె విజయం కూడా అందుకుంది. ఈమె విజయం గురించి తన తండ్రి రవీందర్ సింగ్ మాట్లాడుతూ నా కూతురు పరీక్ష పాస్ అయింది. ఎప్పుడూ కూడా ఈమె చదువుతూనే ఉంటుంది. గత సంవత్సరం దీపావళి పండుగ కి కూడా ఈమె జరుపుకోకుండా చదువుకుంది అని అన్నారు. 12 వ తరగతి లో ఈమెకి 98% వచ్చింది. నిజంగా ఈమె ఎందరికో ఆదర్శం అని కళాశాల ప్రిన్సిపల్ కూడా చెప్పారు. ప్రతిరోజూ 14 గంటలపాటు ఈమె చదువుకుని కష్టం ఎప్పుడూ ఓడిపోదు అని రుజువు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news