మంచు విష్ణు సంచలన నిర్ణయం.. “మా” ఉమెన్ ఎంపవర్ మెంట్ అండ్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు!

మా ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన నిర్ణయం తీసుకున్నారు. విశాఖ గైడ్ లైన్స్ ప్రకారం… మా అసోసియేషన్ లో ఉమెన్ ఎంపవర్ మెంట్ అండ్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు మంచు విష్ణు. ఈ కమిటీకి పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి సునీత కృష్ణన్ గౌరవ సలహాదారు గా ఉంటారని విష్ణు స్పష్టం చేశారు.

నలుగురు మహిళల తో పాటు ఇద్దరు పురుషులతో ఈ కమిటీని చేయబోతున్నామని పేర్కొన్నారు మంచు విష్ణు. అందులోని సభ్యుల పేర్లను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.

మరింత మంది మహిళలు మా అసోసియేషన్ లో సభ్యులు కావాలన్నది తమ లక్ష్యమని… ఇందులో భాగంగానే తాము ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ గ్రీవెన్స్ సెల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు మంచు విష్ణు.  మంచు విష్ణు తాజా నిర్ణయంతో మా ఆర్టిస్ట్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా అక్టోబరు 10వ తేదీన జరిగిన మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే.