అమరావతి కోసం మొదలు పెట్టిన ఆందోళనలు ఏడాది పూర్తి చేసుకున్నాయి. నేడు రాజధాని జనభేరి, రాజధాని అమరావతి రక్షణకై జనభేరి పేరుతో సభ జరగనుంది. రాజధాని గ్రామం అయిన రాయపూడిలో సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు జనభేరి సభ సాగనుంది. జనభేరికి రాజధాని గ్రామాల రైతులు,మహిళలు భారీగా తరలిరానున్నారు. రైతులు,మహిళలు ఆకుపచ్చ కండువా,ఆకుపచ్చ వస్త్రాలు ధరించనున్నారు.
జనభేరి సభకు కొన్ని రాజకీయ పక్షాలు మద్దతు తెలిపాయి. జనభేరి సభకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరుకానున్నారు. జనభేరి సభకు చంద్రబాబు,టీడీపీ నేతలు హాజరు కానున్నారు. మధ్యాన్నం 12గంటలకు సభాస్థలికి చేరుకోనున్న చంద్రబాబు రైతులనుద్దేశించి ప్రసంగించనున్నారు. జనభేరి సభకు పోలీసుల ఆంక్షలు విధించనున్నారు. బయట ప్రాంతాల నుండి ఎవరు రాకుండా ఆంక్షలు విధించిన పోలీసులు చాలా భారీ ఎత్తున మొహరించారు.