టిపిసిసి స్టార్ క్యాంపెనర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో లీక్ అయిన విషయం తెలిసిందే. మునుగోడులో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫోన్ కాల్ చేసిన మాటలు ఆ టైపులో రికార్డ్ అయ్యాయి. దీంతో ఈ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై స్పందించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కొందరు కావాలని తన సోదరుడు వెంకట్ రెడ్డి పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు రాజగోపాల్ రెడ్డి.
ఆయన ప్రజల కోసం కృషి చేసే వ్యక్తి అని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తో కుమ్మక్కు అయిందని ఆరోపించారు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి సీఎం కేసీఆర్ డబ్బులు పంపిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడ్చే మగాడిని నమ్మొద్దని.. రేవంత్ రెడ్డి ఒక దొంగ అని అన్నారు. రేవంత్ రెడ్డికి, కల్వకుంట్ల కవితకి మధ్య ఆర్థిక ఇతర సంబంధాలు ఉన్నాయనిి ఆరోపించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పాటు టిఆర్ఎస్ పార్టీకి చెందిన వారు చాలామంది రాజగోపాల్ రెడ్డి గెలవాలని కోరుకుంటున్నారని అన్నారు.