దీపావళి పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు… చిన్నా, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పండుగను జరుపుకుంటారు.. కుల, మత భేదాలు లేకుండా అందరు సంబరంగా జరుపుకుంటారు. టపాసులు, కొత్త బట్టలు అనేవి ప్రతి ఏడాది ఉండేవే.. కానీ ఇంకాస్త కొత్తగా, వెరైటీగా చేసుకోవాలి అనుకోనేవాల్లు స్వీట్స్ ను చేసుకొండి.. పండుగకు కొత్తగా స్వీట్ చేసుకొవాలని అనుకోవడం కామన్.. అలాంటి వారికోసమే ఈ స్వీట్.. పేణి పాక్.. ఇక ఆలస్యం లేకుండా ఈ స్వీట్ తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు..
పేణి (సన్నని సేమ్యా): 1/2kg
మైదా: 50 grms
నెయ్యి: 250 grms
పంచదార: 1 kg
యాలకుల పొడి : 1 tsp
పాలపొడి: 150 grms
తయారి విధానం..
పంచదార ను ఓ గిన్నెలో వేసి 2 గ్లాసుల నీళ్లు పోసి పాకం పట్టాలి. పంచదార కరిగి సన్నని తీగపాకం రాగానే మైదా, పాలపిండి వేసి ఉండలు లేకుండా కలపాలి. తర్వాత 100గ్రా నెయ్యి పాకంలో పొయ్యాలి. పాకం, పిండి రెండూ బాగా కలిసిన తర్వాత, మిగతా నెయ్యి కొంచెం కొంచెంగా కలపాలి.ఇప్పుడు దానికి పేణి కూడా చేర్చి పూర్తిగా కలిసేలా చేసి దించాలి. తర్వాత నెయ్యి పూసిన ప్లేట్ లో ఈ మిశ్రమాన్ని పోసి చల్లారిన తర్వాత ముక్కలుగా కోస్తే పేణి పాక్ రెడీ.. మీరు కూడా ట్రై చెయ్యండి..ఎలా వచ్చిందో కామెంట్ చెయ్యండి..