ప‌వ‌న్ తో సినిమా అందుకే ఆగిపోయింది…జ‌క్క‌న్న షాకింగ్ కామెంట్స్..!

-

పవన్ కళ్యాణ్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రావాలని పవన్ అభిమానులతో పాటు తెలుగు ఆడియన్స్ ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటివరకు వారిద్ద‌రి నుండి ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. అయితే తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ తో సినిమాపై రాజమౌళి ఆసక్తికర కామెంట్లు చేశారు. శ్రీకాకుళంలో ఓ కాలేజీ ఫెస్టివల్ కు హాజరైన రాజమౌళి స్టూడెంట్ అడిగిన ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ తో మీరు సినిమా ఎప్పుడు చేస్తారు అని ఓ స్టూడెంట్ ప్రశ్నించాడు. దానికి రాజమౌళి సమాధానమిస్తూ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని చాలా సంవత్సరాలు వెయిట్ చేశానని చెప్పారు.

rajamouli about pawan kalyan
rajamouli about pawan kalyan

ఒక మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ను కలిసినట్లు తెలిపారు. ఆయన తో మాట్లాడితే చాలా కంఫర్టబుల్ గా అనిపించింది అని అన్నారు. ఆ తర్వాత సార్ మీరు చెప్పండి ఎలాంటి సినిమా చేయాలని ఉంది… అంటే మీరు ఎలాంటి సినిమా అనుకుంటున్నారో అది చెప్పండి. నేను ఎలాంటి సినిమా చేయడానికి అయినా రెడీ అని ప‌వ‌న్ అన్నార‌ని… సరే అయితే మీరు టైం ఇవ్వండి ఏ టైంలో రమ్మంటారు …ఏ టైంలో వచ్చి మీకు కథ చెప్తాల‌ని అడిగిన‌ట్టు తెలిపారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నుండి కబురు కోసం వెయిట్ చేశాను…. కానీ రాలేదు అని జ‌క్క‌న్న అన్నారు.

ఆయన వేరే సినిమాలు చేస్తూ బిజీ అయ్యారని ఈ లోపు మా థింకింగ్ మారిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం మాస్ సినిమాలు కాదు మోస్ట్ బిగ్గర్ వైడ‌ర్ సినిమాలు చేయాలని మగధీర, య‌మ‌దొంగ‌ సినిమాలు చేసిన‌ట్టు తెలిపారు. కానీ పవన్ కళ్యాణ్ కు సినిమాల కంటే రాజకీయాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చిందని ఈ లోపల ఎక్కువ రోజులు గడిచిపోయాయి అని అన్నారు. తనకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ప్రేమ మరియు రెస్పెక్ట్ అని చెప్పారు. కాకపోతే తాము ఇద్దరూ వేర్వేరు మార్గాల్లో ట్రావెల్ చేస్తున్నామని రాజమౌళి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news