టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కు స్వల్ప అస్వస్థత చోటు చేసుకుంది. దీంతో నటుడు కైకాల సత్య నారాయణ ను ఆస్పత్రి లో చేర్పించారు ఆయన కుటుంబ సభ్యులు. సరిగ్గా నాలుగు రోజుల క్రితం నటుడు కైకాల సత్య నారాయణ ఇంట్లో జారి పడినట్లు సమాచారం అందుతోంది.
అయితే..శనివారం రాత్రి నొప్పి ఎక్కువ కావడంతో కైకాల సత్య నారాయణ ను ఆస్పత్రి లో చేర్పించారు ఆయన కుటుంబ సభ్యులు. ప్రస్తుతం సికింద్రాబాద్ లోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో కైకాల సత్య నారాయణ ను చికిత్స పొందుతున్నారు. కైకాల సత్య నారాయణ ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే… ఆయన అభిమానుల్లో కాస్త… ఆందోళన మొదలైంది. ఆయన ఆరోగ్యం ఎలా ఉందోనని ఆందోళన చెందుతున్నారు ఫ్యాన్స్. కాగా… నటుడు కైకాల సత్యనారాయణ.. ఎన్నో సినిమాల్లో తండ్రి, తాతయ్య పాత్రలు చేసిన సంగతి తెలిసిందే.