కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను తొలగించాలి.. రాహుల్ గాంధీ నోటీసులు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్ష్మీపూర్ ఖేరీ హింసకు వ్యతిరేకంగా లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నోటీసులు ఇచ్చారు. కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రాను తక్షణం పదవి నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 3న లక్ష్మీపూర్ ఖేరీ ఘటనలో రైతులను చంపడానికి కుట్ర పన్నారని యూపీకి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కోర్టుకు తెలిపింది. ఈ కేసులో మొత్తం 13 మంది నిందితుల్లో కేంద్ర మంత్రి కుమారుడు అశిష్ మిశ్రాను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు.

బుధవారం రాజ్యసభ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని తమ ఎంపీలకు కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. ఎగువ సభలో చాలా ముఖ్యమైన అంశం చర్చకు రానున్న నేపథ్యంలో విప్ జారీ చేసినట్లు పార్టీ చీఫ్ విప్ జైరాం రమేశ్ తెలిపారు. రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీల నేతలు ర్యాలీ నిర్వహించారు.