దేవతలకు మొక్కులు తీర్చుకునేప్పుడు మేకలు, గొర్రెలను బలి ఇవ్వడం ఆనవాయితి. పోతు జలతరిస్తేనే బలిఇస్తారు. అప్పుడు అమ్మవారు ఆనందంగా ఆస్వాదిస్తుందని నమ్మకం. అలానే చత్తీస్‌గఢ్‌లోని సూరజ్పూర్ జిల్లాలోని మదన్పూర్ గ్రామంలో బలి ఇచ్చిన మేక కన్ను ఆ వ్యక్తినే బలి తీసుకుంది. కన్ను వల్ల ప్రాణం పోవడం ఏంటా అనుకుంటున్నారా..? ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చత్తీస్‌ఘడ్ లోని సూరజ్పూర్ జిల్లాలోని మదన్పూర్ గ్రామంలో బగర్సయి అనే 50 ఏళ్ల వ్యక్తి స్థానికంగా ఉండే కోపా ధామ్ గుడిలో ఒక మొక్కు మొక్కుకున్నాడు. తన కోరిక తీరిస్తే, మేకను బలి ఇచ్చి, గ్రామస్తులకు విందు చేస్తానని మొక్కుకున్నాడు. కొన్ని రోజులకు బగర్సయి కోరిక తీరింది. దాంతో, ఆయన మొక్కు తీర్చుకోవాలని నిర్ణయించుకుని, కుటుంబ సభ్యులతో కలిసి ఒక మేకను తీసుకుని వెళ్లి, ఆ గుడిలో బలి ఇచ్చాడు. ఇక్కడ వరకూ బానే ఉంది. పూజ కార్యక్రమాలన్నీ ముగిసిన అనంతరం.. ఆ మేకను ముక్కలుగా చేసి, వంట చేయడం ప్రారంభించారు.
ఆ తరువాత, కుటుంబ సభ్యులు, ఇతర గ్రామస్తులతో కలిసి బగర్సయి ఆ మేక మాంసంతో విందు భోజనం చేయడం ప్రారంభించాడు. అయితే, అతడి ప్లేట్‌లో మేక కన్ను భాగం పడడంతో, ఆ కన్ను భాగాన్ని తీసుకుని నోట్లో వేసుకున్నాడు. ఆ కన్ను భాగం అతడి గొంతులో ఇరుక్కుపోయింది. దాంతో, శ్వాస తీసుకోవడంలోె సమస్య ఏర్పడింది. చివరకు స్పృహ కోల్పోయాడు. అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు ప్రకటించారు.
పాపం.. చావు అనేది ఏ వైపు నుంచి ఎలా వస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. హ్యీపీగా మొక్కు తీర్చుకుని కుటుంబ సభ్యులతో భోజనం చేస్తుంటే ఇలా మృత్యువు మేక కన్ను రూపంలో వచ్చింది. చనిపోయే గడియలు దగ్గరకు వస్తే అరటిపండు తిన్నా గొంతుకు అడ్డం పడి చనిపోతారంటారు. తినేప్పుడు కాస్త జాగ్రత్తగా తినాలి. చేప ముల్లు గొంతులో గుచ్చుకోని కూడా ప్రాణాలు కోల్పోయిన వాళ్లు ఉన్నారు.