ఇండియన్ సూపర్ స్టార్ రజని కాంత్ పార్టీ పెట్టడం దాదాపుగా ఖరారు అయిపోయింది. గత కొంత కాలంగా ఆయన పార్టీ పెడతారు అంటూ వస్తున్న వార్తలు నిజమే అంటుంది తమిళ మీడియా. ఆయన పార్టీ పెట్టడం దాదాపుగా ఖరారు అయిపోయిందని అంటుంది. ఏప్రిల్ 14 లేదా 21 న ఆయన పార్టీ పెట్టే అవకాశం ఉందనే వార్తలు ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్ గా మారాయి.
రజని పార్టీ పెట్టే అంశంపై గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. లేదు ఆయన బిజెపిలోకి వెళ్ళే అవకాశ౦ ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. లేదు కమల్ పార్టీలో చేరే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇప్పటికే వాళ్ళు కలిసి పని చేయడానికి సిద్దమైన సంగతి తెలిసిందే. ఇక కొన్ని రోజులుగా రజని బిజెపికి మద్దతుగా మాట్లాడుతున్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని కూడా ఆయన సమర్ధిస్తున్నారు.
దీనితో ఆయన బిజెపిలోకి వెళ్ళడం ఖాయమనే వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. ఈ తరుణంలో ఒక వార్త బయటకు వచ్చింది. పార్టీ పెట్టిన తర్వాత బిజెపి, కమల్ పార్టీలతో కలిసి ముందుకి వెళ్లాలని, వచ్చే ఏడాది అక్కడ ఎన్నికలు ఉన్న నేపధ్యంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చెయ్యాలని ఆయన భావిస్తున్నారు. కనీసం ఏడాది అయినా పార్టీ బలోపేతానికి సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి పార్టీని ఏర్పాటు చెయ్యాలని చూస్తున్నారట.