రజనీ అభిమానులకు పిలుపు.. సర్వత్రా ఉత్కంఠ

Join Our COmmunity

సూపర్ స్టార్ రజనీకాంత్ రేపు అభిమానులతో భేటీ కానున్నారు. 30 మంది జిల్లా అధ్యక్షులు చెన్నైకి రావాలని రజనీ నుండి అభిమానులకు పిలుపు వచ్చింది. సోమవారం ఉదయం 9 గంటలకు రజినీకాంత్ వారితో సమావేశం కానున్నారు. తలైవా పిలుపుతో తమిళ రాజకీయాల్లో మరోసారి ఆసక్తి నెలకొంది. తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో..ఆయన అభిమానులకు సందేశం పంపడం చర్చనీయాంశంగా మారింది.

అయితే ఈయన స్వయంగా ఒక పార్టీ పెడతారని కొన్నాళ్ళు, కాదు ఈయన బీజేపీకి మద్దతు ఇస్తారని కొన్నాళ్ళు ప్రచారం జరిగింది. అయితే ప్రచారాలు ఎన్ని జరిగినా ఈయన మాత్రం ఎన్నడూ నోరు విప్పింది లేదు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో అయన నుండి అభిమానులకు పిలుపు రావడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పక తప్పదు. మరి ఈ క్రమ్రంలో వారితో ఇప్పుడు ఆయన ఏమి చర్చిస్తారో వేచి చూడాలి. 

 

 

TOP STORIES

మీ జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో తడబడుతున్నారా? ఈ విషయాలు తెలుకోండి..

పెళ్ళి.. ఇద్దరి జీవితాలను ఒకటి చేసేది. ఇద్దరు వ్యక్తులను ఒకే దారిలో నడిపేది. మానవుడు అభివృద్ధి చెందుతున్న పరిణామ క్రమంలో పెళ్ళనేది అతడు సృష్టించుకున్న అత్యంత...