ఫేస్బుక్ కి రాజా సింగ్ షాక్…!

-

బిజెపి నేత, ఎమ్మెల్యే రాజా సింగ్ కి ఫేస్బుక్ షాక్ ఇచ్చిన కాసేపటికి ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. బీజేపీ శాసన సభా పక్షనేత రాజా సింగ్ పేరుతో నడుస్తోన్న ఫేస్ బుక్ పేజీలను తొలగించామని ఫేస్‌ బుక్ యాజమాన్యం కాసేపటి క్రితం ఒక ప్రకటన చేసింది. దీనిపై రాజా సింగ్ స్పందిస్తూ ఫేస్బుక్ ప్రకటనకు భిన్నంగా వ్యాఖ్యలు చేసారు. నా పేరుతో కొందరు ఎఫ్బీ పేజీలు తెరిచినట్లు తన నా దృష్టికి వచ్చిందని ఆయన అన్నారు.

వాటిని తొలగించినందుకు ఫేస్‌బుక్ కి ధన్యవాదాలు తెలిపారు. కానీ నా అఫీషియల్ ఫేస్‌ బుక్ పేజీని కూడా 2018లో తొలగించారని ఆయన అన్నారు. దాన్ని పునరుద్ధరించాలని ఫేస్ బుక్ కి మెయిల్ చేస్తున్నానని ఆయన వివరించారు. రాజా సింగ్ ద్వేష పూరిత సమాచారం ప్రచారం చేస్తున్నారని అందుకే ఆయన ఖాతాలను బాన్ చేస్తున్నామని ఫేస్బుక్ ఒక ప్రకటన చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news