ఫామ్ హౌస్ నుంచి ఏరియల్ సర్వే దాకా కేసీఆర్‌ను గుంజుకొచ్చామని.. రాజాసింగ్ పేర్కొన్నారు. వరదల తో జనం గోస పడుతుంటే ఇప్పటిదాకా ఒక అంచనా వేయడం కాని, నష్ట పరిహారం ప్రకటించడం కాని చేతకాని టిఆర్ఎస్, కేంద్రాన్ని బదనాం చేసే కుట్ర చేస్తోందని.. అన్ని కేంద్రం చేస్తే రాష్ట్రంలో ఇక మీ ప్రభుత్వం ఎందుకు . ప్రభుత్వాన్ని రద్దు చేయండి BJP ఆధ్వర్యాన తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్, ప్రజలకు సుభికషమయున పాలన అందిస్తుందని పేర్కొన్నారు.
రోడ్డు మీద పోతే ప్రజలు నిలదీస్తరనే భయం తోనే kcr ఆకాశ మార్గాన పోవాలను కుంటుండని.. ఇండ్లు , పంటలు నష్టపోయిన ప్రజలకు ముందు నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ ఎనిమిది ఏండ్లలో ఎప్పుడైనా పంట నష్టపరిహారం ప్రకటించిందా రాష్ట్ర ప్రభుత్వమని.. పంట నష్ట పరిహానికి కేంద్రం ఇచ్చిన 1000 కోట్లు ఏం చేసారని గత సంవత్సరం హై కోర్టు మొట్టికాయలు వేసినా బుద్ది రాలేదు టిఆర్ఎస్ ప్రభుత్వానికి అని విమర్శించారు. రాజా వారు వరాలు ప్రకటించినటు వరదలు వచ్చిన ప్రతీ సారి వేల కోట్లు ప్రకటించుడు తప్ప ఒక్క పైసా విదిల్చలేదు రాష్ట్ర ప్రభుత్వమని..డిసాస్టర్ మేనేజ్ మెంట్ కింద కేంద్రం ఇస్తున్న నిధులు ఏం చేస్తున్నారో కేసీఆర్ చెప్పాలన్నారు.