ఈ మధ్యన దేశంలో మొత్తం అయిదు చోట్ల అసెంబ్లీ ఎన్నికలు జరిపించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని చోట్లా విడతల వారీగా ఎన్నికలు జరగ్గా.. ఈ రోజు రాజస్థాన్ లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ రోజు ఉదయం ఎన్నో పక్కా ఏర్పట్ల మధ్యన 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం అయింది. ఈ ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు చాలా పెద్ద పెద్ద లైన్ లలో వాటి చేసి మరీ ఓటు వేసిన పరిస్థితులను ఇక్కడ చూడడం జరిగింది. చివరగా ఎన్నికల అధికారులు రాజస్థాన్ లో ఓటింగ్ ను సాయంత్రం 6 గంటలకు క్లోజ్ చేయడం జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు తీసుకున్న లెక్కల ప్రకారం ఇక్కడ ఓటింగ్ 68 శాతం గా నమోదు అయినట్లు అధికారులు తెలియచేశారు.
రాజస్థాన్ లో మొత్తం 199 స్థానాలకు గానూ ఓటింగ్ జరుగగా , ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇక్కడ గెలుస్తుందా లేదా బీజేపీ ఇక్కడ అవకాశాన్ని అందుకుంటుందా అన్నది చూడాలి.