₹500కే గ్యాస్ సిలిండర్.. ఆ రాష్ట్ర సీఎం సూపర్ ఆఫర్

-

వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే అప్రమత్తమైంది. ఓటర్లను ఇప్పటి నుంచే ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని పేదలకు శుభవార్త చెప్పింది రాజస్థాన్​లోని అశోక్​ గహ్లోత్ ప్రభుత్వం. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి, ఉజ్వల యోజన లబ్ధిదారులకు రూ.500కే వంట గ్యాస్​ సిలిండర్​ అందిస్తామని ప్రకటించింది. 2023 ఏప్రిల్​ 1 నుంచి ఈ నిర్ణయం వర్తిస్తుందని తెలిపింది. అర్హులైన కుటుంబాలకు ఏటా 12 సిలిండర్లు ఇలా తక్కువ ధరకే అందిస్తామని సీఎం అశోక్ గహ్లోత్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఈ ప్రకటన చేశారు.

“బడ్జెట్ కోసం కసరత్తులు ప్రారంభించాం. ఇప్పుడైతే నేను ఒకటే చెప్పగలను. పేద ప్రజలకు రూ.500కే సిలిండర్లు ఇస్తాం. ఉజ్వల పథకం కింద ప్రజలకు మోదీ సర్కారు ఎల్​పీజీ కనెక్షన్లు ఇచ్చింది. కానీ సిలిండర్ల ధర రూ.వెయ్యికి చేరింది. ఇప్పుడు అవన్నీ ఖాళీగా ఉన్నాయి.”
-అశోక్ గహ్లోత్, రాజస్థాన్ సీఎం

Read more RELATED
Recommended to you

Latest news