రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ వీర విహారం.. చెన్నై టార్గెట్ 217..

షార్జా వేదిక‌గా జ‌రుగుతున్న ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ 4వ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు చెన్నై పై విజృంభించింది. రాజ‌స్థాన్ టీం నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 216 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. చెన్నై సూప‌ర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. రాజ‌స్థాన్ బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో జ‌ట్టు ప్లేయ‌ర్లు విజృంభించి ఆడ‌డంతో రాజ‌స్థాన్ భారీ ల‌క్ష్యాన్ని చెన్నై ఎదుట ఉంచ‌గ‌లిగింది.

rajasthan royals made 216 against csk

రాజ‌స్థాన్ బ్యాట్స్‌మెన్ల‌లో సంజు శాంస‌న్ (32 బంతుల్లో 74 ప‌రుగులు, 1 ఫోర్‌, 9 సిక్స‌ర్లు), స్టీవెన్ స్మిత్ (47 బంతుల్లో 69 ప‌రుగులు, 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు)లు వీర‌విహారం చేశారు. దీంతో రాజ‌స్థాన్ భారీ స్కోరు చేయ‌గలిగింది. ఇక చెన్నై బౌల‌ర్ల‌లో శామ్ కుర్రాన్ 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా దీప‌క్ చాహ‌ర్‌, లుంగి ఎంగిడి, పీయూష్ చావ్లాలు త‌లా 1 వికెట్ తీశారు.