మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఓట్ల గల్లంతు విషయంలో ఈసీ పలు ఆరోపణలను ఎదుర్కోంది. దీంతో ప్రతీ ఏటా జనవరి 1 వ తేదీన ఓటరు జాబితాను ప్రకటించే ఎన్నికల సంఘం ఈసారి ఆ తేదిని ఫిబ్రవరి 25 కి మార్చింది. ఇప్పటికే కొత్త ఓట్ల నమోదుకు 8లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, ఓట్ల తొలగింపు కోసం 10 వేల దరఖాస్తులు వచ్చాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల కోసం జనవరి 25 తేదీవరకు దరఖాస్తులను స్వీకరిస్తామని ఆయన తెలిపారు. అయితే తుది ఓటరు జాబితాను ముద్రించిన అనంతరం ఓట్ల తొలగింపు ఉండదు కాబట్టి గల్లంతైన వారు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.