మహేష్ సినిమాలో అనసూయ

-

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరక్షన్ లో మహర్షి సినిమ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి చేయగానే సుకుమార్ సినిమా లైన్ లో పెట్టాడు మహేష్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మించబడుతుంది. త్వరలో ముహుర్తం పెట్టుకోనున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. ఇక ఈ మూవీలో యాంకర్ అనసూయ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందట.

ఇప్పటికే యాంకర్ గా బుల్లితెర మీద తన అందచదాలతో అలరిస్తున్న అనసూయ సిల్వర్ స్క్రీన్ పై కూడా తన సత్తా చాటుతుంది. రంగస్థలం రంగమ్మత్తగా అదరగొట్టిన అనసూయ ఇప్పుడు వైఎస్సార్ యాత్ర మూవీలో కూడా నటిస్తుంది. ఇప్పుడు మహేష్ సినిమాలో కూడా మరో ప్రత్యేక పాత్రకు సెలెక్ట్ అయ్యిందట. సుకుమార్ డైరక్షన్ లోనే రంగస్థలం వచ్చింది. మరి ఆ సెంటిమెంట్ తోనే అనసూయని మహేష్ సినిమాలో కూడా తీసుకున్నాడు సుకుమార్. మహేష్ సినిమాలో మొదటిసారి ఛాన్స్ అందుకున్న అనసూయ ఎలా అలరిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news