సీరియల్స్ కు షాక్ ఇచ్చిన రజినీకాంత్ …!

సూపర్ స్టార్ రజనీకాంత్ ఎక్కడైనా సరే తను సూపర్ స్టార్ నే అని నిరూపించుకున్నారు. వేదిక ఏదైనా సరే తనకంటూ ఒక ప్రత్యేక చాటుకుంటారు రజనీ కాంత్. ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘అన్నాత్త’ అనే సినిమాలో నటిస్తున్నారు రజనీ కాంత్. ఈ చిత్రంలో ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. సినిమా పనుల్లో బిజీగా ఉన్నప్పటకీ కూడా రజనీకాంత్ తాజాగా బేర్ గ్రిల్స్ తో కలిసి చేసిన ఒక రియాలిటీ షో సూపర్ హిట్ అయింది.

ఈ ప్రోగ్రామ్‌కు డిస్కవరి చానెల్‌లో 12 భాషల్లో ప్రసారం అయింది. ఈ ప్రోగ్రామ్ మార్చి నెల 23 న రాత్రి 8 గంటలకు డిస్కవరి చానెల్‌లో ప్రసారమైంది. ఈ రియాలిటీ షో ఈ యేడాదిలోనే అత్యధిక రేటింగ్ సాధించిన రియాలిటీ షోగా అంతే కాకుండా అత్యధిక రేటింగ్ సాధించిన ప్రోగ్రామ్‌గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ రియాలిటీ షో వివరాలు కనుక చూస్తే మన సూపర్ స్టార్ రజనీకాంత్ బేర్ గ్రిల్స్‌తో కలిసి ‘ఇన్ టూది వైల్డ్ విత్ బియర్ గ్రిల్స్’ అనే ప్రోగ్రాం ఒకటి చేశారు.

కర్ణాటకలోని బందీపురా టైగర్ రిజర్వ ఫారెస్ట్‌లో ఈ ప్రోగ్రామ్ కు సంబంధించిన షూటింగ్ జరిగింది. ఈ ప్రోగ్రామ్ చేసే సమయంలో రజినీకాంత్ కు గాయాలు అయ్యాయి. తమిళనాడులో ఎక్కువ మంది ఈ ప్రోగ్రామ్ చూసారు. బార్క్ ఇండియా లెక్క ప్రకారం సుమారు 12.4 మిలియన్ల మంది ఈ ప్రోగ్రామ్‌ను చూసారు. టీవీలో ఈ కార్యక్రమం ప్రచారమైన టైమ్ లో వేరే మిగతా వాటి రేటింగ్స్ పూర్తిగా పడిపోయాయి. ఈ షో ప్రచారమైనన్ని రోజులు అన్ని ఛానెల్స్ లోని హిట్ సీరియల్స్ ఆదరణ కోల్పోయాయి. ఇక్కడ కూడా రజనీ తన మానియా కనబరిచారు.