లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ ఫిల్మ్ శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నది. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమాకు దేశవ్యాప్తంగా అన్ని చోట్ల చక్కటి స్పందన లభిస్తోంది.
కమల్ హాసన్ ఈజ్ బ్యాక్ అని మూవీ చూసిన సినీ అభిమానులు అంటున్నారు. ఫ్యాన్ బాయ్ అయిన లోకేశ్ కనకరాజ్ కమల్ హాసన్ ను చాలా బాగా చూపించారని అంటున్నారు. సినిమా పట్ల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ వీక్షించారు.
సినిమా గురించి ‘సూపర్ ..సూపర్..సూపర్’ అని సూపర్ స్టార్ రజనీ కామెంట్ చేశారట. దర్శకుడు లోకేశ్ కనకరాజ్, అనిరుద్, మహేంద్రన్ లను పిలిపించుకుని రజనీ వారిని అభినందించారని సమాచారం. కమల్ హాసన్ నాలుగేళ్ల తర్వాత ప్రేక్షక లోకానికి చాలా చక్కటి సినిమాలో కనిపించారని పేర్కొన్నారు. సినిమా విషయమై రజనీకాంత్..కమల్ హాసన్ ను అభినందించారు.
Hearing Superstar @rajinikanth has watched #Vikram and called up #Ulaganayagan @ikamalhaasan and told him "Super.. Super.. Super.. "
He also called @Dir_Lokesh , @anirudhofficial and Co-producer #Mahendran and congratulated them..
What a nice gesture 👏
— Ramesh Bala (@rameshlaus) June 5, 2022