మాంసాహారం కన్నా ఎక్కువ మేలేనది రజ్మా. ఇందులో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్ వంటి ఖనిజ లవణాలతో పాటు కాపర్, ఓమేగా ఫ్యాటీ ఆసిడ్స్ లభిస్తాయి. ఇది మతిమరుపును దూరం చేయడంతోపాటు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఇందులో ఫైబర్ అధిక మొత్తంలో ఉండడం వల్ల కొలెస్రాటల్‌ని తగ్గిస్తున్నది. మైగ్రేన్, కీళ్లనొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
కావాల్సినవి :
ఉడికించిన రాజ్మా : ఒక కప్పు
ఉడికించిన ఆలుగడ్డ : ఒక కప్పు
పచ్చిమిర్చి తరుగు : పావు టీస్పూన్
కొత్తిమీర తురుము : పావు కప్పు
కారం : అర టేబుల్‌స్పూన్
ధనియాలపొడి : అర టేబుల్‌స్పూన్
జీలకర్ర : పావు టేబుల్‌స్పూన్
గరంమసాలా పొడి : అర టేబుల్‌స్పూన్
ఉప్పు : తగినంత
తయారీ :
ముందుగా వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. అందులో ఉడికించి రజ్మా, ఆలుగడ్డలను మెత్తగా చేసుకోవాలి. వీటితోపాటు కారం, ధనియాలపొడి, జీలకర్రపొడి, గరంమసాలా, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, కొత్తిమీర తురుము, వేసి బాగా కలుపుకొని ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయిలో నూనె వేసి ఆలు, రజ్మా మిశ్రమాన్ని కట్‌లెట్లుగా చేసుకొని రెండువైపులా దోరగా వేయించుకోవాలి. తర్వాత వీటిని సర్వింగ్ ప్లేటులోకి తీసుకోవాలి. దీంట్లోకి టమాటా కచప్ తింటే టేస్ట్ అదిరిపోతుంది. స్కూల్ నుంచి ఇంటికొచ్చే పిల్లలకు ఈ స్నాక్స్ బాగా తింటారు. రుచితో పాటు ఆరోగ్యాన్నిస్తుంది.