జ‌గ‌న్‌ను న‌మ్మిన లేడీ నేత‌కు బంప‌రాఫ‌ర్‌… ఏకంగా రాజ్య‌స‌భ సీటే..!

2239

న‌మ్మ‌కానికి వైసీపీ అధినేత జ‌గ‌న్ పెద్ద‌పీట వేశారు. త‌న‌ను న‌మ్మి పార్టీలో చేరిన నాయ‌కుల‌కు ఆయ‌న పెద్ద ఎత్తున ఛాన్స్‌లు ఇస్తున్నారు. ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో ఓడిపోయిన వారికి కూడా త‌న మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పించారు. అదేస‌మ‌యంలో పార్టీలో గ‌ట్టి వాయిస్ వినిపించిన మ‌హిళ‌ల‌కు సైతం ఆయ‌న మంచి మంచి ప‌ద‌వులు ఇచ్చారు. ఇక‌, ఫైర్‌బ్రాండ్లుగా గుర్తింపు తెచ్చుకున్న వారికి కూడా ఆయ‌న కీల‌క ప‌ద‌వులు ఇచ్చి గౌర‌వించారు. ఈ కోవ‌లోనే ఇప్పుడు ఉత్త‌రాంధ్ర‌కు చెందిన కీల‌క రాజ‌కీయ నాయ‌కురాలు, మాజీ మంత్రి కిల్లి కృపారాణికి కూడా జ‌గ‌న్ మంచి స్థానం ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న కిల్లికి రాజ్య‌స‌భ సీటును ఇచ్చేందుకు సిద్ద‌మైన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. విష‌యం లోకి వెళ్తే.. దివంగ‌త‌ వైఎస్ పిలుపుతో రాజ‌కీయాల్లో కివ‌చ్చారు డాక్ట‌ర్ కిల్లి కృపారాణి. ఆమె అంత‌కు ముం దు వైద్యురాలిగా గుర్తింపు సాధించారు. ఈ క్ర‌మంలోనే ఎంపీగా పోటీ చేసి విజ‌యం సాధించి కేంద్రంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు. వైఎస్ ప్రోత్సాహంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన కిల్లి 2004 ఎన్నిక‌ల్లో దివంగ‌త మాజీ కేంద్ర మంత్రి ఎర్ర‌న్నాయుడిని ఢీ కొట్టి ఓడించింనంత ప‌నిచేశారు. ఇక 2009 ఎన్నిక‌ల్లో అదే ఎర్ర‌న్నాయుడిని ఓడించారు. ఆ త‌ర్వాత సామాజిక స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో ఎవ్వ‌రి అంచ‌నాల‌కు అంద‌కుండానే అనూహ్యంగా కేంద్ర మంత్రి ప‌ద‌వి సొంతం చేసుకున్నారు.

అయితే, రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్‌లో ఉన్న‌ప్ప‌టికీ.. పెద్ద‌గా ఆమె క్రియాశీలం కాలేక పోయారు. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నా రు. ఈ క్ర‌మంలో శ్రీకాకుళం ఎంపీ లేదా టెక్క‌లి అసెంబ్లీ టికెట్లు ఇవ్వాల‌ని జ‌గ‌న్‌ను కోరారు. అయితే, ఈ రెండు సాధ్యం కాక‌పోవ‌డంతో ఆమెకు శ్రీకాకుళం పార్ల‌మెంట‌రీ జిల్లా పార్టీ ఇంచార్జ్‌గా ప‌గ్గాలు అప్ప‌గించారు. ఎన్నిక‌ల‌కు ముందు ఒకానొక ద‌శ‌లో ప‌లాస నుంచి పోటీ చేయాల‌ని పార్టీ కోరినా ఆమె తిర‌స్క‌రించారు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌ఫున అభ్య‌ర్థుల‌ను గెలిపించుకునేందుకు ఆమె తీవ్రంగా శ్ర‌మించారు. కానీ, రాష్ట్రం మొత్తం జ‌గ‌న్ సునామీ ధాటికి టీడీపీ ఓడిపోయినా.. ఇక్క‌డ మాత్రం బ‌ల‌మైన నాయ‌కులుగా ఉన్న కింజ‌రాపు కుటుంబం మొత్తం విజ‌యం సాధించింది.

టెక్క‌లిలో అచ్చ‌న్నాయుడు, శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహ‌న్‌నాయుడు విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత పార్టీలో విబేధాలు కూడా పొడ‌చూపాయి. టెక్క‌లి, శ్రీకాకుళం ఎంపీ సీట్ల నుంచి పోటీ చేసిన పేరాడ తిల‌క్‌, దువ్వాడ శ్రీనివాస్ ఇద్ద‌రూ కిల్లికి వ్య‌తిరేకంగా రాజ‌కీయాలు చేశారు. ఆమెపై జ‌గ‌న్‌కు కంప్లెంట్లు కూడా చేశారు. అయినా కూడా త‌న‌ను న‌మ్ముకునిపార్టీలో చేరిన కిల్లికి ఉత్త‌మ గౌర‌వం ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న జ‌గ‌న్ ఆదిశ‌గానే ఆమెకు మ‌హిళ‌, కాళింగ‌, ఉత్త‌రాంధ్ర కోటాలో రాజ్య‌స‌భ సీటును ఇవ్వాల‌ని నిర్ణ‌యిచుకున్న‌ట్టు స‌మాచారం. తాజా ఎన్నిక‌ల్లో భారీ విజ‌యాన్ని న‌మోదు చేసుకున్న వైసీపీకి చాలా మటుకు రాజ్య‌స‌భ సీట్లు ద‌క్కే చాన్స్ ఉండ‌డంతో ఇలాంటి వారికి న్యాయం చేయాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్న‌ట్టే తెలుస్తోంది.