టీఆర్‌ఎస్‌ పార్టీపై రాకేష్‌ తికాయత్ సీరియస్ !

-

ఇవాళ హైదరాబాద్‌ నిర్వహించిన రైతుల ధర్నాలో రాకేష్ తికాయత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలపై నిప్పులు చెరిగారు. తెలంగాణ లో అధికార పార్టీ పట్ల జాగ్రతగా ఉండండని… తెలంగాణ పార్టీ బీజేపీ కి కొమ్ముకాసే పార్టీ..వారిని తెలంగాణ దాటి బయటకు పంపించకూడదన్నారు. ఆదివాసీ సమస్యల పరిష్కరించుకోవాలి.. దేశంలో నిరుద్యోగ సమస్యపై అందరం కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతులకు కూడా ప్రభుత్వం సహాయం చేయాలన్నారు.

రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమం ఆగదని… వచ్చే పార్లమెంట్ సెషన్ లో మద్దతు ధర బిల్లు తేవాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని మోడీ పెద్ద పెద్ద కంపెనీలకి అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారని… రైతు సంఘాలు అడిగిన ప్రశ్నలకు మోడీ దగ్గర సమాధానం లేదని ఆగ్రహించారు. కేంద్రాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ నడిపిస్తుందని మండిపడ్డారు. వాళ్ళు చెప్పేదే నడుస్తుందని… భాష వేరు కావచ్చు..కానీ రైతుల అందరి లక్ష్యం ఒకటేనని తెలిపారు. ఆందోళనలు చేస్ వారిని ప్రలోభాలకు గురి చేశారని… కానీ అందరూ ఏకతాటిపై నిలబడ్డారని వెల్లడించారు. మోడీ ప్రకటన తో వెనక్కి తగ్గేది లేదు..ఆందోళన కొనసాగుతుందన్నారు. పండించిన పంటకు మద్దతు ధర ల చట్టం తేవాల్సిందేనని స్పష్టం చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా లో విభేదాలు తెచ్చే కుట్రలు చేస్తుందన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news