రియా- సుశాంత్‌తో సంబంధం ఉన్న డ్రగ్స్ కేసులో చిక్కుకున్న రకుల్ ప్రీత్ సింగ్ తిరిగి హైదరాబాద్ కి చేరుకుంది. రియా కారణంగా ఎన్సీబీ నుంచి సమన్లు అందుకున్న రకుల్ రెండు రోజుల పాటు విచారణని ఎదుర్కొంది. కేసు విచారణ కోసం ముంబై వెళ్లిన రకుల్ అంతకు ముందు ఢిల్లీ హై కోర్టు లో పిటీషన్ వేయడం కోసం ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. దీంతో క్రిష్ మూవీ షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. `కొండ పొలం` నవల ఆధారంగా క్రిష్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
సాయి ధరమ్‌తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. రకుల్ సింగ్ ఇందులో హీయిన్‌గా పక్కా పల్లెటూరి అమ్మాయిగా నటిస్తోంది. ఈ మూవీ కోసం ఎన్సీబీ విచారణ అనంతరం రకుల్ హైదరాబాద్ చేరుకున్నట్టు తెలిసింది. త్వరలో మరోసారి ఎన్సీబీ విచారణకు పిలిస్తే మూవీ షెడ్యూల్ డిస్టర్బ్ అవుతుందని భావిస్తున్న దర్శకుడు క్రిష్ రకుల్ కోసం కొత్త ప్లాన్‌ని సిద్ధం చేశారట. క్రిష్ ఆమెకు సంబంధించిన ప్రధాన సన్నివేశాలను షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. రకుల్ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు చెబుతున్నారు.