తనపై అసత్య కథనాలని ప్రచారం చేస్తున్నట్లు ఆమె న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. రియా చక్రవర్తికి సంబంధించి ఎన్‌సిబి అధికారులు రకుల్ ప్రీత్ సింగ్‌ను ప్రశ్నించారు. రియా మరియు ఆమె డ్రగ్స్ గురించి చాట్ చేసినప్పటికీ తాను ఎప్పుడూ డ్రగ్స్ ఉపయోగించలేదని రకుల్ అధికారులకు తెలిపిందని ఆమె న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.
`నన్ను ఎన్సీబీ ప్రశ్నించిన సందర్భంలో నేను ఎవరి పేర్లనీ ప్రస్తావించలేదు. కానీ మీడియా మాత్రం నేను కొంత మంది పేర్లని వెల్లడించినట్టు భిన్నమైన కథనాల్ని ప్రసారం చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవం, గోప్యత, ఒంటరిగా వుండే నా హక్కుని కాలరాసు్తన్నారు` అని ఈ సందర్భంగా రకుల్ కోర్టుకు విన్నవించినట్టు తెలిసింది. మీడియా తన ప్రతిష్టను దెబ్బతీస్తోందని ఆమె తన అభ్యర్ధనలో వెల్లడించారట. తనని ఎన్సీబీ సాక్షిగా మాత్రమే పిలిచిందని కానీ మీడయా మాత్రం నిరాధారమైన వార్తల్ని రాసి నా ప్రతిష్టను దెబ్బతీస్తోందని రకుల్ ఈ సందర్భంగా మండిపడినట్టు చెబుతున్నారు.