షారుక్ ఖాన్ కు రామ్ చరణ్ సూపర్ రిప్లై..!!

-

బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన పఠాన్ చిత్రం ట్రైలర్ నేడు రిలీజ్ అయ్యింది. ఇక సినిమా లో సన్నివేశాలు నభూతో నభవిష్యతి అన్న విదంగా ఉన్నాయి. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా గ్రాఫిక్స్ వర్క్ ఉంది. ఇక షారుక్ ఖాన్ హాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. దీపిక పదుకొనె కూడా అందాలను విపరీతంగా చూపిస్తూ బికినీలతో రెచ్చిపోయింది.

ఇక ఈ సినిమా తెలుగు  ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేయడం జరిగింది. రామ్ చరణ్ ట్రైలర్ ను రిలీజ్ చేయడం పట్ల షారుఖ్ ఖాన్ సంతోషం వ్యక్తం చేస్తూ, ట్విట్టర్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. థాంక్యూ సో మచ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మీ టీమ్ ఆస్కార్ ను ఇంటికి తీసుకు వచ్చినప్పుడు ఒక్కసారి నన్ను దానిని టచ్ చేయనివ్వండి, లవ్ యూ అంటూ పోస్ట్ పెట్టారు.

ఇక ఈ పోస్టు కు రామ్ చరణ్ చాలా గౌరవంగా ఆస్కార్ అవార్డు వస్తే అది భరత దేశం మొత్తానికి వచ్చినట్లే అని సూపర్ గా రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు ఈ పోస్టు లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక షారుక్ ఖాన్ కూడా ఆస్కార్ అవార్డు అన్నారు అంటే అవార్డ్ దగ్గరలోనే ఉందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news