చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వెబ్ సైట్ ఆవిష్కరించిన రామ్ చరణ్

-

హైదరాబాద్ : చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వెబ్ సైట్ ఆవిష్కరించారు మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్. ఈ సందర్భంగా రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ… 25 భాషల్లో వెబ్ సైట్ అందుబాటులో ఉంటుందని.. దేశవ్యాప్తంగా మరిన్ని ప్రాంతాలకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ విస్తరణ చేస్తామన్నారు. స్లాట్ బుక్ చేసుకొని రక్తదానం చేయొచ్చని… చెప్పారు రామ్ చరణ్.

నాన్న నట వారసత్వాన్నే కాదు సేవా తత్వాన్ని కూడా తీసుకుంటున్నానని… చిన్న,చిన్న అడుగులతో తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని ప్రకటించారు.

మరో 30 ఏళ్లపాటు నా ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంకు సేవలు కొనసాగుతాయని… రెండో దశలో బ్లడ్ బ్యాంకు కోసం ప్రత్యేక యాప్ తయారు చేయా లనే ఆలోచన ఉందని వెల్లడించారు. మా సినిమా పారితోషకాలతో ఈ బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు కొనసాగు తుందని.. 10 మందికి సహాయం అందుతుదంటే దాతల నుంచి విరాళాలు తీసుకుంటామన్నారు. త్వరలో మా ట్రస్టును నాన్నగారు పునర్ నియామకం జరుగుతుందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news