గుప్పెడంతమనసు ఎపిసోడ్ 271 : రిషీ- వసూల మధ్య మాటల యుద్దం..కాలేజ్ లో హై టెన్షన్ మధ్యలో మొదలైన ఇంటర్వూ

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రిషీ, ఫణీంద్ర మీరు అన్నీ ఏర్పాట్లు చూడండి..నేను నాన్నని కలుస్తాను అంటాడు. ఫణీంద్ర జగతిమేడమ్ రాలేదేంటి ఇంకా అంటాడు. రిషీ మనుసలో వచ్చేవాళ్లు వస్తారు, వెళ్లే వాళ్లు వెళ్లారు. డీబీఎస్టీకి సంబంధించి నాకు ఎవ్వరూ ఎక్కువకాదు. నాకు కాలేజే ముఖ్యం అనుకుంటాడు. ఫణీంద్ర ఏమైంది అంటే..మీడియా వాళ్లు వస్తున్నారు, ఆ ఏర్పాట్లు చూడండి అని వెళ్లిపోతాడు. మరోసీన్ లో జగతి ఒక చోటుకి వచ్చి రిషీ అన్న మాటలను తలుచుకుంటూ ఉంటుంది. గతంలో రిషి అన్న మాటలను, రిషీ చిన్నతనాన్ని అన్నీ గుర్తుచేసుకుంటుంది. బడ్డేకి రిషీ బొకేఇచ్చిన ఫొటో చూసుకుంటూ..అమ్మనెప్పుడు అర్థంచేసుకున్నావ్ అని కొత్తగా అపార్థం చేసుకోవటానకి, నీకు కావలిసిందే అర్థంచేసుకున్నావ్,ఈ విషయంలో నేను ఎ‌వర్ని నిందించలేను, ఇది నా తలరాత, ఈరోజు నీ జీవితంలో గొప్పరోజు అవుతుంది..ఓడిపోవటం నాకు అలవాటే..ఛానల్ వాళ్ల ఇంటర్వూ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అనుకుంటూ కంటతడిపెడుతుంది.

ఇంకోవైపు మహేంద్ర, వసూ జగతి కోసం వెళ్లేందుకు కారు దగ్గరు వస్తుంటారు. రిషీ వచ్చి ఛానల్ వాళ్లువచ్చేస్తున్నారట, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు అంటాడు. జగతి కాలేజ్ నుంచి వెళ్లిపోయిందట అంటాడు మహేంద్ర. రిషీ అయితే అంటాడు..మహేంద్ర అయితే ఏంటి, జగతిది ఈ కాన్సప్ట్. ఇంటర్వూ టైంకి తనులేకపోతే ఎలా చెప్పు అంటాడు, వసూ కూడా అవును సార్, మేడమ్ అలా చేయరు, ఎందుకు వెళ్లిపోయిందో ఏంటో అని అంటుంది. ఆహా అందుకుని మీ ఇద్దరు బయలుదేరారా, ఏంటీ డాడ్ ఇది, వెళ్లినవాళ్ల గురించి ఆలోచిస్తారా అంటాడు రిషీ. ఇంతలోనే ఛానల్ వాళ్లు వస్తారు. అదిగో ఛానల్ వాళ్లు వచ్చారు, ఇప్పుడు మీరు వెళ్తే ఎలా డాడ్ అంటాడు రిషీ. సార్ మేడమ్ వచ్చివెళ్లారని అటెండెర్ చెప్పారు, అసలేమైందో అని చెప్పబోతుంది వసూ.రిషీ మాత్రం వసుధార ఛానల్ వాళ్లు వచ్చారు, అర్థమవుతుందా, పదండి వెళ్దాం, టైం వేస్ట్ చేయొద్దుఅని ముందుకెళ్తాడు. వసూ సారీ సార్ అంటుంది. రిషీ మళ్లీ ఇటటువైపు తిరిగి సారీ ఆ సారీ ఏంటి అంటాడు. వసూ మేడమ్ లేకుండా నేను ఈ ఇంటర్వూకి రాను అని సీరియస్ గా చెప్పేస్తుంది. ఏంటి వసుధార నువ్వునా అసిస్టెంట్ వి అంటాడు. వసు కావొచ్చు అని అంటుంది. రిషీ ఛానల్ వాళ్లు వచ్చారు అంటాడు. వసూ రానివ్వండి సార్ అంటుంది. రిషీ నీకు నేను ఎక్కువ మీ మేడమ్ ఎక్కువ అంటాడు. మహేంద్ర ఈ మాటలను విని షాక్ అవుతాడు. ఎక్కువ తక్కువలు సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి అంటుంది వసూ..రిషీ కోపంగా..ఆహా..ఈ సందర్భంలో ఎవరు ఎక్కువో చెప్పు మరి అంటాడు. మహేంద్ర ఆపే ప్రయత్నం చేస్తాడు. కానీ రిషీ మాత్రం డాడ్ వసుధారను చెప్పనివ్వండి, నువ్వు చెప్పు వసుధార ఎవరు ఎక్కువో చెప్పు అంటాడు. వసూ సార్ నేను మేడమ్ లేకుండా ఇంటర్వూలో ఉండలేను, ఈ ప్రాజెక్ట్ హెడ్ తను, నేను వెళ్తున్నాను సార్ అని మహేంద్రతో సార్ మీరెక్కడే ఉండండి, నేను మేడమ్ ని తీసుకొస్తాను అంటుంది. మహేంద్ర వసుధార అంటే..రిషీ సీరియస్ గా డాడ్ ఏంటి మీరు వెళ్తున్నాను అని చెప్పాక ఇంకా బతిమిలాడతారు అని మహేంద్ర చేయి పట్టుకుని తీసుకెళ్లిపోతాడు.

మహేంద్ర నువ్వు ధైర్యంగా చెప్పగలిగావ్, నేను చెప్పలేకపోయాను వసుధార అనుకుని చేయి వదిలేస్తాడు మహేంద్ర. రిషీ ఏం డాడ్ మీకు వెళ్లాలనుందా, వెళ్లే వాళ్లని వెళ్లనివ్వండి చాలు డాడ్ అని మహేంద్రని లోపలికి తీసుకెళ్తాడు.ఈలోపు ఆ ఛానల్ వాళ్లు కారు దిగి లోపలికి వెళ్తారు.

మరోపక్క దేవయాని ఏమైంది..జగతి విషయం ఎలా తీసుకోవాలి అనుకుంటూ అటుగా వెళ్తున్న ధరణిని పిలుస్తుంది. దేవయాని ధరణితో నీ ఫోన్ నుంచి తనకి ఫోన్ చేయ్ అంటుంది. తనంటే ఎవరు అత్తయ్య గారు అంటుంది ధరణి..దేవయాని ఏదేదో చెప్పి వసుధార కి కాల్ చేయ్ మంటుంది. ధరణి ఏం మాట్లాడతారు అత్తయ్యగారు అంటుంది. వసూ ఆటోలో వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఫోన్ వస్తుంది. ధరణి అక్కడ కాలేజ్ లో ప్రోగ్రామ్ బాగా జరుగుతుందా అంటుంది. వసూ నేను కాలేజ్ లో లేను,మేడమ్ కాలేజ్ లో లేరు, నేను తనకోసమే వెతుకుతున్నాను అని వసూ ఇంకా చెప్పబోతుంది. దేవయాని కాల్ కట్ చేస్తుంది. ఏంటి అత్తయ్యగారు మాట్లాడుతుంటే కట్ చేస్తారు అని ధరణి అడుగుతుంది. నాకేం కావాలో, ఎంతకావాలో తెలుసు కదా, వెళ్లి స్వీట్ తీసుకురా అని ధరణిని పంపిస్తుంది.

కట్ చేస్తే జగతి ఇంటికి వచ్చినట్లు ఉంటది. రిషీ ఇంటర్వూకి రెడీ అవుతాడు. పుష్ప వచ్చి సార్ వసుధార అంటే..వచ్చిందా అని అడుగతాడు. రాలేదు సార్ అంటుంది. వస్తుందిలే అంటాడు. ఇంకో స్టాఫ్ మెంబర్ వచ్చి జగతి మేడమ్ రాలేదు అని చెప్తుంది. మేడమ్ ఎ‌వరు ఉన్నా ఎవరు లేకున్నా ఇంటర్వూ ఆగదు. డీబీఎస్టీ కాలేజ్ అంటే ఒకరిదద్దరు వ్యక్తులు కాదు కదా అంటాడు. మహేంద్ర మళ్లీ జగతికి ఫోన్ చేస్తాడు. జగతి ఫోన్ లిఫ్ట్ చేయదు. జగతి ఎక్కడో కారులోనే ఉంటుంది. మహేంద్ర మళ్లీ వసూకి ఫోన్ చేస్తాడు. వసూ అప్పుడే ఇంటికి వె‌ళ్తుంది. మేడమ్ ఎక్కడున్నారో నాకు ఇంకా తెలియలేదు సార్, మీరు సార్ పక్కనే ఉండండి అంటుంది. వసూ ఇంట్లోకి వెళ్లి మళ్లీ జగతికి కాల్ చేస్తుంది. జగతి ఫోన్ స్విచ్చ్ ఆఫ్ చేస్తే అనుకుని ఫోన్ ఆఫ్ చేస్తే మహేంద్ర కంగారుపడతాడు అనుకుంటుంది. మరోపక్క ఇంటర్వూ స్టాట్ అయిపోతుంది. ఇంతలో ఒక అతను వచ్చి మీ ఫోన్ కి ఫోన్ లైవ్ స్ట్రీమింగ్ లింక్ పంపించాను అని చెప్తాడు. అదే లింక్ రిషీ మహేంద్రకు పడెతాడు.

ఇంట్లో వసూ మేడమ్ ఎక్కడికి వె‌ళ్లారని ఆలోచిస్తూ ఉంటుంది. వసుధార ఇంటర్వూకి కావాలని తప్పించుకుంది, ఇంత పెద్ద ఇంటర్వూ, నా అసిస్టెంట్, ఎంత పొగరు తనకి అనుకుని వసూకి కాల్ చేస్తాడు.రిషీ. వసూ కాల్ కట్ చేస్తుంది. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. నేనెక్కువా, మీ మేడమ్ ఎక్కువా అని అడిగారు అని అనుకుటుంది. రిషీ నువ్వు చేసింది తప్పు టెలికాస్ట్ చూడు, లింక్ పంపిస్తున్నాను అని వసూకి లింక్ పంపిస్తాడు. ఇటుపక్క మహేంద్ర కూడా జగతికి వాయిస్ మేసేజ్ పంపిస్తాడు. జగతి ఓపెన్ చేసి వింటుంది. నువ్వు ఎందుకు ప్రోగ్రామ్ మిస్ అయ్యావ్ జగతి, నాకు టెన్ష్షన్ గా ఉంది, కనీసం ఫోన్ ఆన్ లో అయినా పెట్టావ్ అని ఇంటర్వూ లింక్ పంపిస్తాడు. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయిభాగంలో రిషీ ఇంటర్వూని వసూ, జగతి ఇద్దరు ఫోన్ చూస్తుంటారు. రిషీని ఈ ఐడియా మీకు వచ్చిందేనా అని జర్నలిస్ట్ అడుగుతుంది..నిజం చెప్పాలంటే ఇది నా ఆలోచన కాదు అని చెప్తాడు. చూద్దాం రిషీ ఏం చెప్తాడో

Read more RELATED
Recommended to you

Latest news