ఆచార్య నుండి క్రేజీ అప్డేట్.. సిద్ద, సిద్దం అయిపోయాడు !

Join Our Community
follow manalokam on social media

చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ నటిస్తున్నట్లు ముందు నుంచి ప్రచారం జరుగుతూ వస్తోంది. ఈ విషయం మీద ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. చిరంజీవి 1,2 ఇంటర్వ్యూలలో రామ్ చరణ్ ఈ సినిమాలో నటిస్తున్నాడు అని చెప్పాడు. కానీ మేకర్స్ ఇప్పటి దాకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ రోజు రామ్ చరణ్ తేజను ఈ సినిమా సెట్స్ లోకి ఆహ్వానిస్తూ సినిమా దర్శకుడు కొరటాల శివ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

మా ‘సిద్ధ’ సర్వం సిద్ధం. రామ్ చరణ్ గారికి సెట్స్ లోకి స్వాగతం అంటూ దర్శకుడు కొరటాల శివ ట్వీట్ చేశారు. దీంతో రామ్ చరణ్ ఆచార్య షూటింగ్ మొదలు పెట్టినట్లు క్లారిటీ వచ్చేసింది. అలానే ఈ సినిమాలో సిద్ధ పాత్రలో నటిస్తున్నట్టు క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రామ్ చరణ్ తేజ మ్యాట్ని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిరంజనరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

TOP STORIES

శనిత్రయోదశి రోజు ఏం చేయాలి?

శనిదేవుడు అంటేనే మనకు భయం. ఎందుకంటే శనిదేవుడు మన జన్మరాశిలోకి ప్రవేశిస్తే ఏడు ఏళ్లు మనకు కష్టాలు కలుగుతాయనే నమ్మకం. నిజానికి శనిదేవుడు మంచివాడు. శని...