భీమ్లానాయ‌క్ విడుద‌ల‌పై రామ్‌గోపాల్ వ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

-

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన భీమ్లానాయ‌క్ మ‌రికొన్ని రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది. మ‌ల‌యాళి సూప‌ర్ హిట్ అయ‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ రీమెక్‌గా సిద్ధ‌మ‌వుతున్న ఈ చిత్రానికి సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. చాలా కాలం త‌రువాత ప‌వ‌న్ ఓ ప‌వ‌ర్ పుల్ పోలీస్ రోల్‌లో క‌నిపించ‌డం ఆయ‌న‌కు ప్ర‌త్య‌ర్థిగా రానా న‌టిస్తుండ‌టంతో ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

మార్కెట్‌లో మంచి లాభాలు వ‌స్తున్న త‌రుణంలో భీమ్లానాయ‌క్‌ను తెలుగు, హిందీ భాష‌ల్లో ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల చేయాల‌ని చిత్ర నిర్మాణ సంస్థ నిర్ణ‌యించింది. భీమ్లానాయ‌క్ హిందీ విడుద‌ల‌పై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ స్పందించాడు. ప‌వ‌న్ చిత్రాన్ని హందీలో విడుద‌ల చేయ‌డం త‌నకు ఎంతో ఆనందంగా ఉంద‌ని కామెంట్ చేశారు. గ్రేట్‌.. భీమ్లానాయ‌క్ హిందీలో కూడా విడుద‌ల‌వుతుంది. బ‌న్నికంటే తాను పెద్ద‌వాడిని ఈ విధంగా నిరూపించుకునే అవ‌కాశం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు వ‌చ్చింద‌ని వ‌ర్మ ట్వీట్ చేశారు. మ‌రొక‌వైపు అల్లుఅర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టించిన పుష్ప గ‌త ఏడాది చివ‌రిలో విడుద‌లై కేవ‌లం బాలీవుడ్‌లోనే 100 కోట్ల గ్రాస్ సొంతం చేసుకున్న‌ట్టు స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Latest news