మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిన రామ్ గోపాల్ వర్మ..!!

రాంగోపాల్ వర్మ అంటే సోషల్ మీడియాలో తెలియని వారుండరు. ఎందుకంటే తాను ఒక చిన్న ట్వీట్ తోనే అగ్గిరాజేసే రకం. దానిలో ఏమి లేకపోయినా అందులో ఏదో ఉన్నట్లు అందరిని ఆ చర్చలో పాల్గొనేల చేస్తాడు. మనోడు డోనాల్డ్ ట్రంప్ నుండి, గరిక పాటి దాకా ఎవ్వర్ని వదలకుండా టార్చర్ పెడుతూనే ఉంటాడు. అలాగే ఎవడు చూసినా చూడక పోయినా తాను సినిమాలు చేసుకుంటూ వెళ్ళి పోతూనే ఉంటాడు.

ramgopal varma

ఇక తాజాగా దాసరి కిరణ్ తో రాంగోపాల్ వర్మ  వ్యూహం అనే సినిమాను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా లో మెయిన్ గా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి తీయాలని, సినిమాని కూడా వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు విడుదలయ్యేలా రామ్ గోపాల్ వర్మ  ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికంటే ముందే ఆయన లెస్బియన్ లవ్ స్టోరీ గా ‘డేంజరస్ అనే సినిమాని తీసాడు. దీనికి టాగ్ లైన్ గా మా ఇష్టం అని పెట్టాడు. నైనా గంగూలీ మరియు అప్సర రాణి ఈ చిత్రం లో జంటగా నటించారు. ఇందులో ఇద్దరు ఆడవాళ్ల మధ్య జరిగే రొమాన్స్ ను ఆయన మాటల్లో అందంగా చూపించారు.

గతంలో  కోర్టు లో కేసు వెయ్యడం వల్ల ఈ సినిమా విడుదల ఆగింది.ఆపేసారు. ఇప్పుడు అన్నీ క్లియర్ అయ్యి ఈ నెల 9 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కాబోతుంది.ఈ సందర్భంగా ఏర్పాటు ఈ మీడియా సమావేశం ఈ సినిమా మన సంస్కృతికి విరుద్ధం గా ఉందని..ఈ సినిమాని ఆపాలని అన్నారుగా అంటే, దీనికి రామ్ గోపాల్ వర్మ  తనదైన శైలిలో  ‘ఇక్కడకి వచ్చిన మీడియా ప్రతినిధులతో అమ్మాయిలు చాలా మంది ఉన్నారు కదా..మీరే ఈ సినిమాని చూసి ఎలా ఉందొ చెప్పండి..కచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇక నుండి మీరు ఇదే ట్రెండ్ ఫాలో అవుతారు అని వారి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసాడు.